భారతదేశం, జూలై 4 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో శివ నారాయణ రెస్టారెంట్స్ బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ పోటీగా తన బ్రాంచ్స్ ఓపెన్ చేశానని దక్షిణామూర్తి చెప్పి వెళ్లిపోతాడు. మా బ్రాంచ్ సీక్రెట్స్ ఎలా తెలిసాయి. ఆఫీస్‌లో దక్షిణామూర్తి మనిషి ఎవరైనా ఉన్నారా అని శివ నారాయణ అనుమానపడతాడు.

అప్పుడే బయట దక్షిణామూర్తితో సూరజ్ మాట్లాడుతాడు. అది చూసిన శివ నారాయణ షాక్ అవుతాడు. ఇదంతా కార్తీక్, దీప చూస్తారు. సూరజ్ వెళ్లిపోతుంటే నువ్వు దక్షిణామూర్తి మనిషివా అని నిలదీస్తాడు శివ నారాయణ. దక్షిణామూర్తి ఎవరని సూరజ్ అంటాడు. ఇప్పటివరకు నువ్వు మాట్లాడిన వ్యక్తి, అతను నీతో ఏం మాట్లాడాడు అని శివ నారాయణ అడుగుతాడు.

ఆయన అడిగిన దానికి చెప్పాను. అతను మీ ఇంట్లో విషయాలు గురించి అడిగాడు. ఇలాంటి వివరాలు నన్ను అడగొద్దు మా సర...