భారతదేశం, జూన్ 6 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీప, కార్తీక్ కాఫీకి వెళ్తారు. సూరజ్‌ను చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో సూరజ్ కనిపించడు. దాంతో లేచి కంగారుగా చూస్తుంది జ్యోత్స్న. అప్పుడే వెనుక నుంచి వచ్చి షాక్ ఇస్తాడు సూరజ్.

ఇలా వస్తానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా. రౌడీలతో నువ్వే కొట్టించావని తెలుసు అని సూరజ్ అంటాడు. దానికి ప్రూఫ్ ఉందా. మహా అయితే మా తాతతో చెబుతావ్ అంతేగా. రెండు రోజుల్లో నిన్ను ఆఫీస్ నుంచి పారిపోయేలా చేస్తాను అని జ్యోత్స్న అంటుంది. నీ పతనం మొదలైందని సూరజ్ అంటే.. నన్ను తట్టుకుని దీపను గెలిపించడం నీ వల్ల కాదని జ్యో అంటుంది.

నువ్ అహంకారంతో నిండిపోయిన కోతిలాంటిదానివి. ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడి ఎవరు పట్టుకోలేరని గెంతులేస్తున్నావ్. దానికి బుద్ధి చెప్పడానికి నాలాంటి వాడు జెట్ ఫ్లై...