భారతదేశం, మే 23 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో అందరిని భోజనానికి శివ నారాయణ పిలుస్తాడు. కార్తీక్, దీప తర్వాత తింటారని, మనం ముందు తిందామని జ్యోత్స్న అంటుంది. ఇంకా వీళ్లను పనివాళ్లుగా చూస్తున్నావా. నీతో తింటే హోదా పడిపోతుందా అని కాంచన తిడుతుంది. మేము తర్వాత తినం మీతోనే తింటామని కార్తీక్ అంటాడు.

నువ్వు పనివాడివి కదా అని పారు అంటే.. ఎవరికీ నీకా అని శివ నారాయణ కోప్పడుతాడు. అగ్రిమెంట్ అని పారిజాతం అంటే.. అదేది లేదని, వాడు కూతురు కొడుకు. ఇంట్లో ఉన్నన్ని రోజులు కలిసే తింటాం అని శివ నారాయణ తెగేసి చెప్పి పోతాడు. ఇది ఇంత శాడిస్ట్‌లా తయారైందేంట్రా అని కాంచన అంటే.. కొత్తగా అవడం ఏంటీ, బై బర్త్ అదేగా అని కార్తీక్ అంటాడు.

భోజనం చేసేటప్పుడు కూడా ఇంట్లో కేవలం రసంతోనే తింటారేమో అని జ్యో అవమానిస్తుంది. రసం...