భారతదేశం, జూన్ 13 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీపకు మెయిల్ వస్తే మేనేజర్ ఫుడ్ ఆర్డర్ వచ్చినట్లుందని చెబుతాడు. చదివి చెప్పమని దీప అంటే.. వద్దు మేడమ్, నా మీద మీకు నమ్మకం లేదుగా సూరజ్ గారితోనే చదివించుకోండని చెప్పి వెళ్లిపోతాడు మేనేజర్.

కార్తీక్ ఇచ్చిన యాప్ ఐడియా గుర్తుకు వచ్చి మెయిల్ ఏది వచ్చిందో ఫొటో తీసి ట్రాన్స్‌లేట్ చేస్తుంది దీప. మెయిల్ ఏం వచ్చిందో చూద్దామని జ్యోత్స్న వస్తుంది. ఏమే ఫిఫ్త్ క్లాస్ అని జ్యో అంటే.. పోయి పని చూసుకోవే కల్తీదానా అని జ్యోత్స్న అంటుంది. ఏయ్ అని జ్యో అంటే.. ఏంటే.. రెస్టారెంట్‌లో కల్తీ చేసింది నువ్వేగానే అని దీప గట్టిగా అంటుంది.

నువ్వేమో గొప్పదానివినట్టుగా మాట్లాడుతున్నావ్. నువ్వేం మోసాలు చేయలేదా. ఫొటో తీసి ట్రాన్స్‌లేట్ చేయడం కాదు వారికి రిప్లై ఇవ్వాలి. అది ఇంగ్లీ...