భారతదేశం, జూన్ 25 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో కంపెనీలో సీఈఓ అనౌన్స్‌మెంట్ కోసం బోర్డ్ మీటింగ్ ఏర్పాటు అవుతుంటుంది. మెంబర్స్ వచ్చారని శివ నారాయణకు స్టాఫ్ బాయ్ చెప్పడంతో మీటింగ్‌కు వెళ్తాడు. దారిలో కార్తీక్ ఆపి ఒక వర్ధమాన నటుడుని చూశాక బోర్డ్ మీటింగ్‌కు వెళ్లమని ఆపుతాడు.

పారిజాతం కూడా ఆఫీస్‌కు వస్తుంది. ఎందుకు వచ్చావని శివ నారాయణ అడిగితే.. సీఈఓ ఎవరనేది కళ్లారా చూద్దామని వచ్చానని పారు అంటుంది. జ్యోత్స్న కాల్ చేసి చెబుతానని చెప్పాగా అని అంటే.. లైవ్‌లో చూస్తే వచ్చే మజా వేరని పారు అంటుది. మరోవైపు బాలరాజు దగ్గరికి వెళ్లిన కార్తీక్ ఇది షూటింగ్‌లా ఉండదని, పాత్రలు ప్రవేశాన్ని బట్టి మారిపోతుందని చెబుతాడు.

బాలరాజు కళ్లకు గంతలు కడతాడు. ఎదుటి వాళ్లను మీరు చూస్తే వాళ్లు తమ ఎక్స్‌ప్రెషన్స్‌తో నిన్ను డామినే...