కారు సీటు కింద రూ. 9 కోట్ల బంగారం - సినీ ఫక్కీలో ఛేజ్ చేసి పట్టుకున్న డీఆర్ఐ!
భారతదేశం, అక్టోబర్ 11 -- విశాఖలో అర్ధరాత్రి వేళ జాతీయ రహదారిపై సినీ ఫక్కీలో ఛేజ్ చేసి రూ. 8.98 కోట్ల విలువైన అక్రమ బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోల్కతా నుంచి హైదరాబాద్కు సీక్రెట్ గా రవాణా చేస్తున్న 5,832.90 గ్రాముల విదేశీ బంగారాన్ని సీజ్ చేశారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.
కోల్కతా మార్గంలో విదేశీ బంగారం అక్రమ రవాణా జరుగుతోందన్న స్పష్టమైన ముందస్తు సమాచారంతో డీఆర్ఐ అధికారులు జాతీయ రహదారిపై కాపు కాశారు. అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక కారును గురిపెట్టి.. కొంతదూరం ఛేజ్ చేసి చివరకు అడ్డుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని తొలుత ప్రశ్నించగా వారు ఏమీ తెలియనట్లు నటించారు.
కారులో ఉన్నవారి సమాధానాలపై అనుమానం రావడంతో అధికారులు కారును క్షుణ్ణంగా తనిఖీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.