భారతదేశం, నవంబర్ 19 -- సొంత కారు కొనాలనేది చాలామంది కల. అయితే కొత్త కారు కొనేటప్పుడు మోడల్ ఎంపికతో పాటు అత్యంత కీలకమైన ఆర్థిక నిర్ణయం ఒకటి ఉంటుంది.. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? బ్యాంకు నుంచి ఎంత రుణం తీసుకోవాలి? సాధారణంగా కారు ధరలో 20 శాతం ముందస్తుగా డౌన్ పేమెంట్ కడితే రుణ భారం, నెలవారీ ఈఎంఐ గణనీయంగా తగ్గుతాయి. కానీ చేతిలో ఉన్న డబ్బును ఎక్కువగా డౌన్ పేమెంట్ రూపంలో కట్టేస్తే, తక్షణ నగదు లభ్యత (లిక్విడిటీ) తగ్గిపోవడమే కాకుండా మంచి పెట్టుబడి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇలాంటి సందర్భాల్లో కారు లోన్ వడ్డీ రేటు, పెట్టుబడులపై ఆశించే రాబడి, ప్రస్తుత అప్పులు, చేతిలో ఉన్న నగదు నిల్వలు, అందుబాటులో ఉన్న ఇతర పెట్టుబడి మార్గాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి. కారు రుణ వడ్డీ రేట్లు, పెట్టుబడి రాబడులు, ఈఎంఐలు, అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్) మన కారు ఫ...