భారతదేశం, మే 25 -- చాలా మంది కారు కొనేటప్పుడు కేవలం నెలవారీ ఈఎంఐ (EMI) ఎంత వస్తుంది అనే దానిపైనే దృష్టి పెడతారు. తక్కువ డౌన్ పేమెంట్ కట్టి, లోన్ గడువును 7 లేదా 8 ఏళ్లకు పెంచుకుంటే ఈఎంఐ తగ్గుతుంది కాబట్టి కారు 'చౌక'గా వస్తుందని భ్రమపడతారు. కానీ, దీనివల్ల మీరు కట్టే వడ్డీ భారం తడిసి మోపెడవుతుంది. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే 20/4/10 రూల్ ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.

ఈ ఫార్ములా మూడు ప్రధానాంశాలపై ఆధారపడి ఉంటుంది.

20% డౌన్ పేమెంట్ (ముందస్తు చెల్లింపు): కారు ఆన్-రోడ్ ధరలో కనీసం 20 శాతం సొమ్మును ముందే చెల్లించాలి. దీనివల్ల లోన్ మొత్తం తగ్గి, వడ్డీ భారం తక్కువగా ఉంటుంది.

4 ఏళ్ల లోన్ గడువు: కారు లోన్‌ను కేవలం 4 ఏళ్ల (48 నెలల) లోపే చెల్లించి ముగించాలి. కారు అనేది విలువ తగ్గిపోయే ఆస్తి (Depreciating Asset). దీని కోసం ఎక్కువ కాలం లోన్ కట్టడం ...