కాచిగూడ - తిరుచానూరు మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు. ఈ నెల 20 నుంచే స్టార్ట్..! టైమింగ్స్ ఇలా
భారతదేశం, ఆగస్టు 18 -- తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. కాచిగూడ నుంచి తిరుచానూరు మధ్య నూతన వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ కొత్త వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లకు 17607/17608 నంబర్లను కేటాయించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలు సమయాలను రైల్వే శాఖ ఖరారు చేసింది.
ఈ వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లు రెండు వైపులా ప్రయాణించే క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ఈ రైలు తిరుచానూరు చేరుకుంటుంది.
హైదరాబాద్ జంట నగరాలు మరియు ఉమ్మడి నల్గొండ, గుంటూరు, ప్రకాశం, నెల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.