భారతదేశం, ఆగస్టు 18 -- తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. కాచిగూడ నుంచి తిరుచానూరు మధ్య నూతన వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ కొత్త వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 17607/17608 నంబర్లను కేటాయించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలు సమయాలను రైల్వే శాఖ ఖరారు చేసింది.

ఈ వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండు వైపులా ప్రయాణించే క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ఈ రైలు తిరుచానూరు చేరుకుంటుంది.

హైదరాబాద్ జంట నగరాలు మరియు ఉమ్మడి నల్గొండ, గుంటూరు, ప్రకాశం, నెల్...