భారతదేశం, జూన్ 13 -- Kakinada Jahnavi Missing Case Updates : కాకినాడ జిల్లా సీహెచ్‌ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 8 రోజులు దాటింది. అయితే ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారంగా భావించిన పెంపుడు కుక్క శనివారం నాడు హఠాత్తుగా మృతి చెందింది. ఈ ఘటనతో అటు పోలీసులు, ఇటు బాలిక తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. చిన్నారి ఆచూకీ చెబుతుందనుకున్న మూగజీవం అనారోగ్యంతో కన్నుమూయడంతో కేసు దర్యాప్తుపై సందిగ్ధత నెలకొంది.

ఈనెల 6వ తేదీన చిన్నారి జ్ఞానేశ్వరి ఇల్లు దాటి బయటకు వెళ్లిన సమయంలో ఈ పెంపుడు కుక్క కూడా ఆమెతో పాటే వెళ్ళింది. వారం రోజుల క్రితం చిన్నారితో పాటే మిస్ అయిన ఈ కుక్క.. నాలుగు రోజుల క్రితం ఒంటిపై గాయాలతో ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ మూగజీవం గతానికి భిన్నంగా ప్రవర్తించింది. విపర...