భారతదేశం, ఫిబ్రవరి 28 -- కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ ఘటనలో. పలువురు సజీవ దహనమయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.

సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 18 మందికిపైగా కార్మికులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

పేలుడు తీవ్రత దాటికి పక్క గ్రామంలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఓ పాఠశాలలోని స్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన పలువురుని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఎక...