భారతదేశం, నవంబర్ 26 -- గద్వాల సబ్‌డివిజన్ టీజీఎస్‌పీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) అన్నారపు రమేష్ బాబు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. రూ.60,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారు, ఆయన సహ కాంట్రాక్టర్ చేసిన పనులకు సంబంధించిన రూ.12,62,070 బిల్లును మంజూరు చేసి.. ప్రాసెస్ చేసేందుకు ఏడీఈ రమేష్ బాబు ఈ లంచం డిమాండ్ చేశారు. ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఫిర్యాదుదారుతో ఆయన మాట్లాడారు. లంచం సొమ్ము రూ.60,000ను తన కారు డ్యాష్‌బోర్డుపై పెట్టాలని సూచించారు. అధికారి చెప్పినట్లే ఫిర్యాదుదారు ఆ మొత్తాన్ని కారు డ్యాష్‌బోర్డుపై ఉంచారు.

ఏడీఈ రమేష్ బాబు వద్ద నుంచి రూ.60,000 లంచం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. AP07CZ4705 రిజిస్...