భారతదేశం, అక్టోబర్ 30 -- ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ వ్యాప్తి చేస్తోందని చెప్తున్న తప్పుడు కథనాలను, ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబరు 2వ తేదీన భాగ్యనగరంలో భారీ పాదయాత్ర చేపట్టనున్నారు.

హైదరాబాద్ నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర మోజంజాహి మార్కెట్ (చౌరస్తా) వరకు కొనసాగుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు శుక్రవారం విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. యాత్ర ముగింపు స్థానమైన మోజంజాహి చౌరస్తా వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు, ...