భారతదేశం, మే 26 -- కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొద్ది రోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న 'నాయకత్వ మార్పు' అంశం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వీధులకు చేరింది. మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో సీఎం సిద్దరామయ్య కీలక భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా హాజరుకానుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారమే ఢిల్లీ చేరుకోగా, వెనువెంటనే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా అక్కడకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరినట్లుగా భావిస్తున్న 'అధికార పంపిణీ' ఒప్పందం (Power Sharing Agreement) ప్రకారం.. రెండున్నరేళ్ల తర్వాత డ...