భారతదేశం, జూన్ 7 -- Cancer Weekly Horoscope : జూన్ 7 నుండి 13, 2026 వరకు ఉన్న సమయం కర్కాటక రాశి (Cancer) వారికి ఎంతో అద్భుతంగా, లాభదాయకంగా ఉండబోతోంది. చాలా కాలంగా మీరు దేని కోసమైతే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో, ఆ శుభవార్త ఈ వారంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. ఈ వారం దాదాపు అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారి, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి.

సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. మీలోని సృజనాత్మకత ఇతరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ వారం మీ ప్రేమ జీవితం, కెరీర్ అత్యున్నత స్థాయిలో సాగుతాయి. అయితే, వారం ప్రారంభంలో మరియు మధ్యలో కొన్ని విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం.

ఉద్యోగస్తులకు ఈ వారం కొత్త ఆశలను, ఉత్సాహాన్ని ఇస్తుంది. కెరీర్...