భారతదేశం, జూన్ 19 -- వేద జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాశి మార్పునకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాల పరిమితిలో తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఈ గ్రహాల సంచారం వల్ల అంతరిక్షంలో ఎన్నో శుభ యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే జూన్ 2026లో ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన శుభ యోగం కలగబోతోంది. అదే త్రిగ్రహి యోగం.

ప్రస్తుతం దేవగురువు బృహస్పతి, లగ్జరీ లైఫ్‌కు కారకుడైన శుక్రుడు ఇప్పటికే కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. ఈ తరుణంలో.. జూన్ 22, 2026న గ్రహాల యువరాజుగా పిలిచే బుధుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కర్కాటకంలో బుధుడి రాకతో ఈ మూడు గ్రహాల కలయిక పూర్తయి, అద్భుతమైన త్రిగ్రహి యోగం ఉద్భవిస్తుంది. జ్యోతిష్యశాస్త్రంలో ఈ యోగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రభావవంతమైనదిగా భావిస్తారు.

జ్యోతిషశాస్త్రం ప్రకారం... ఒకే రాశిచక్రంలో ...