కరెన్సీ నోట్ల తరహా భద్రత, అధికారిక 'రాజముద్ర'తో పాస్ పుస్తకాలు : చంద్రబాబు
భారతదేశం, జూన్ 8 -- పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన 'మీ భూమి- మీ హక్కు' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. "భూమి రైతులదైతే... గత పాలకులు పొలం సరిహద్దు రాళ్లు, పాస్ పుస్తకాలపై తమ సొంత బొమ్మలు ముద్రించుకున్నారు. భూతం తరహాలో రైతుల వెంటపడి, ప్రజల సొమ్ము రూ.800 కోట్లు పెట్టి గెలాక్సీ గ్రానైట్ రాళ్లపై బొమ్మలు వేసుకున్న దుర్మార్గుల పాలన అది.' అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బ్రిటిషర్ల కాలం నాటి పటిష్టమైన రెవెన్యూ రికార్డులను గత పాలకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరిట ఒక నల్ల చట్టాన్ని తెచ్చి తారుమారు చేశారని, భూములు కాజేసేందుకు ప్రయత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి భూ యాజమాన్య హక్కులను రక్షించామని స్పష్టం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.