కదులుతున్న రైలులో నుంచి మిస్సింగ్... ఆంధ్రాలో అస్సాం యువతి మృతదేహం - అసలేం జరిగింది..?
భారతదేశం, అక్టోబర్ 9 -- స్వస్థలానికి వెళ్లేందుకు రైలు ఎక్కి అదృశ్యమైన అస్సాంకు చెందిన ఓ యువతి. ఆంధ్రా పరిధిలోని రైలు పట్టాల పక్కన శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతురాలిని గౌహతికి చెందిన 21 ఏళ్ల డ్యాన్సర్ హిమాశ్రీ బోరోగా గుర్తించారు. అయితే తన కుమార్తె ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోలేదని.. ఇది కచ్చితంగా హత్యేనని మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
అస్సాంలోని గౌహతి సమీపంలోని బొండా ప్రాంతానికి చెందిన హిమాశ్రీ బోరో తన డాన్స్ బృందంతో కలిసి ఒక నృత్య పోటీలో పాల్గొనడానికి విశాఖపట్నం వచ్చింది. అయితే గౌహతిలో జరగనున్న పరీక్షకు హాజరుకావాల్సి ఉండటంతో, బృందం కన్నా ముందే ఆమె ఒక్కతే ఇంటికి బయలుదేరింది. అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (దాదాపు 12.15 గంటలకు) విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆమె 22503 కన్యాకుమారి-దిబ్రూగఢ్ వివేక్ సూపర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.