భారతదేశం, సెప్టెంబర్ 3 -- దేశంలో అత్యంత ఆదరణ పొందిన మద్యం బ్రాండ్లలో ఒకటైన ఓల్డ్ మంక్ (Old Monk) చుట్టూ చట్టపరమైన చిక్కులు ముసురుకున్నాయి. ఈ పానీయాన్ని 'రమ్' పేరుతో విక్రయించడానికి అనుమతించబోమని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ) బాంబే హైకోర్టుకు తెగేసి చెప్పింది. న్యూట్రల్ స్పిరిట్, రమ్ ఫ్లేవరింగ్ పదార్థాలతో దీనిని తయారు చేస్తున్నారని, కాబట్టి ఇది అసలైన రమ్ కాదని స్పష్టం చేసింది.

"ఈ ఉత్పత్తిని రమ్‌గా విక్రయించడానికి ఏమాత్రం అనుమతించలేం" అని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీని స్థానంలో 'రమ్ ఫ్లేవర్డ్ స్పిరిట్' అనే పేరుతో మార్కెటింగ్ చేసుకోవచ్చని ధర్మాసనానికి వివరించారు.

ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ అభ్యంతరాల నేపథ్యంలో ఓల్డ్ మంక్ తయారీ సంస్థ మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్, సవరించిన నూతన లేబుళ్లను కోర్టుకు సమర్పించింది. ...