భారతదేశం, ఏప్రిల్ 1 -- ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు బుధవారం నాటి ట్రేడింగ్‌లో భారీగా పుంజుకున్నాయి. కంపెనీ మార్చి నెలలో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో ఇన్వెస్టర్లు మళ్లీ ఈ స్టాక్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఒక్కరోజే ఓలా షేర్లు ఏకంగా 14.21 శాతం పెరిగి రూ. 26.04 స్థాయిని తాకాయి. గత ఏడు నెలల్లో ఓలా స్టాక్‌లో ఇదే అతిపెద్ద ఒక్కరోజు పెరుగుదల కావడం విశేషం.

మార్కెట్ నియంత్రణ సంస్థలకు కంపెనీ అందించిన సమాచారం ప్రకారం... గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నెలలో వాహన రిజిస్ట్రేషన్లు ఏకంగా 150 శాతం పెరిగాయి. వాహన్ (VAHAN) డేటా ప్రకారం మార్చిలో 10,117 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. ఫిబ్రవరి నెలలో ఈ సంఖ్య కేవలం 3,973 యూనిట్లు మాత్రమే ఉంది. అంటే కేవలం ఒక్క నెలలోనే కంపెనీ అమ్మకాల్లో ఎంతటి వేగవంతమైన రికవరీ సాధించిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలోనే భారతద...