భారతదేశం, అక్టోబర్ 31 -- ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 31) ఒక్కరోజు సుమారుగా 20 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు భాషలో ఐదు వరకు మూవీస్ ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ అయి దేశవ్యాప్తంగా పాకి సూపర్ హిట్ అయిన సినిమా కాంతార. ఆ మూవీకి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన సినిమానే కాంతార చాప్టర్ 1. పీరియాడిక్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 మూవీకి హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి మెయిన్ లీడ్ రోల్ చేశాడు.

రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన కాంతార చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 852 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది రికా...