ఓటీటీ, డిజిటల్ మీడియాకు కేంద్రం ఆదేశాలు: వీడియోల సమయం, ఏఐ కంటెంట్‌పై స్పష్టత
భారతదేశం, నవంబర్ 4 -- డిజిటల్ మీడియా, ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు, వార్తా వెబ్సైట్లు కంటెంట్ ప్రసారంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సమాచార సాంకేతిక (ఐటీ) చట్టం 2000, ఐటీ నిబంధనలు 2021 కింద నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తొమ్మిది కీలక అంశాలతో కూడిన ప్రత్యేక అడ్వైజరీని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
తాజా మార్గదర్శకాల ప్రకారం.. డిజిటల్ న్యూస్ సంస్థలు ప్రసారం చేసే వీడియోలు, చిత్రాలకు అవి చిత్రీకరించిన తేదీ, ప్రదేశం, సందర్భాన్ని స్పష్టంగా పేర్కొనాలి. సోషల్ మీడియా లేదా ఇతర బయటి వనరుల నుంచి తీసుకున్న విజువల్స్ అయితే, ఆ వనరు పేరుతో పాటు సమయాన్ని తప్పనిసరిగా చూపించాలి.
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో సృష్టించిన లేదా మార్పులు చేసిన ఫోటోలు, ఆడియో, వీడియోలను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.