భారతదేశం, ఆగస్టు 11 -- కర్ణాటకలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని ప్రముఖ బహుభాషా నటుడు, సామాజిక వేత్త ప్రకాష్ రాజ్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) ద్వారా ఒక వీడియోను విడుదల చేసిన ఆయన, ఈ పరిణామాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

తన ఓటు హక్కును తొలగించడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "బెంగళూరు నియోజకవర్గంలోనే నేను పుట్టి పెరిగాను. ఇక్కడే పాఠశాల, కళాశాల విద్యను అభ్యసించాను. థియేటర్ ఆర్టిస్ట్‌గా నా ప్రస్థానాన్ని ప్రారంభించాను. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. అలాంటిది SIR ప్రక్రియ తర్వాత ఓటు హక్కు కోల్పోయిన 65 లక్షల మందిలో నేను ఒకడినయ్యాను. ఇదో పెద్ద జోక్ లాగా ఉంది" అని ప్రకాష్ రాజ్ ఆవేదన...