భారతదేశం, జూన్ 1 -- ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (Olectra Greentech) 2025-26 ఆర్థిక సంవత్సరానికి (FY26) గాను అద్భుతమైన వార్షిక ఫలితాలను ప్రకటించింది. రికార్డు స్థాయిలో ఈవీ వాహనాల డెలివరీలు, రెండంకెల ఆదాయ వృద్ధి, లాభాల శాతాన్ని పెంచుకుంటూ కంపెనీ సరికొత్త మైలురాళ్లను అధిగమించింది.

గత ఆర్థిక సంవత్సరంలో (FY25) రూ. 1,801.90 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం.. ఈ ఆర్థిక సంవత్సరంలో (FY26) 28 శాతం వృద్ధితో రూ. 2,312.17 కోట్లకు చేరింది. ప్రజా రవాణా సంస్థల నుంచి ఎలక్ట్రిక్ బస్సులకు ఉన్న విపరీతమైన డిమాండ్, అంతర్గత కార్యాచరణ సామర్థ్యం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. వాహనాల డెలివరీల పరంగా చూస్తే, గతేడాది అందించిన 972 వాహనాలతో పోలిస్తే ఈసారి ఏకంగా 32 శాతం వృద్ధితో 1,280 ఎలక్ట్రిక్ వాహనాలను కస్టమర్లకు...