భారతదేశం, సెప్టెంబర్ 13 -- Rajendra Prasad Speech In Pithapuram Lo Ala Modalaindi Pre Release Event: ప్రేయసి రావే సినిమా డైరెక్టర్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పిఠాపురంలో అలా మొదలైంది. రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ రాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో నటించారు.

మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎమ్ మురళి (గోదారి కిట్టయ్య) ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పిఠాపురంలో అలా మొదలైంది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురంలో అలా మొదలైంది మూవీ టీజర్‌ను సీనియర్ హీరో సుమన్ రిలీజ్ చ...