భారతదేశం, మార్చి 13 -- భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ వారం ఒక పీడకలలా మిగిలిపోయింది. మార్చి 13తో ముగిసిన ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడవ వారం కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఒక్క వారంలోనే సెన్సెక్స్ 4,355 పాయింట్లు (5.5%) పడిపోగా, నిఫ్టీ 1,300 పాయింట్లు (5.3%) నష్టపోయింది. దీనివల్ల ఇన్వెస్టర్ల సంపద ఏకంగా Rs.20 లక్షల కోట్లు ఆవిరైపోయింది.

మార్కెట్ పతనానికి 5 ప్రధాన కారణాలు:

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని, అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ నాయకత్వాన్ని తుడిచిపెట్టేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

అంతర్జాతీయ...