భారతదేశం, సెప్టెంబర్ 27 -- పాత రూపాయి నోటు ఉంటే రూ.45 లక్షలు ఇస్తామన్న ప్రకటనను నమ్మి ఒక వ్యక్తి తన కష్టార్జితాన్ని దారపోశాడు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు, డిఎస్పీ పేరుతో బెదిరింపులకు భయపడి నాలుగు రోజుల్లోనే రూ.7.9 లక్షలకు పైగా సమర్పించుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.

హైదరాబాద్‌కు చెందిన 49 ఏళ్ల బాధితుడు సెప్టెంబర్ 20న సోషల్ మీడియాలో ఒక ప్రకటన చూశాడు. 'మీ దగ్గర పాత ఒక రూపాయి నోటు ఉంటే రూ.45 లక్షలకు కొనుగోలు చేస్తాం.' అనేది ఆ ప్రకటన సారాంశం. ప్రకటనలోని ఫోన్ నంబర్‌ను బాధితుడు సంప్రదించగా, డబ్బులు అకౌంట్‌లో వేయడానికి ముందు నోటు ఫోటోలు, వ్యక్తిగత వివరాలు కావాలని సైబర్ కేటుగాళ్లు కోరారు. బాధితుడు వివరాలు పంపిన వెంటనే అసలు మోసం మొదలైంది. రూ.45 లక్షల భారీ మొత్తం డిపాజిట్ చేయడానికి ఆదాయపు పన్ను, ఆర్‌బీఐ క్లియరెన్స్ ఛార్జీల పేరుతో డబ్బులు...