భారతదేశం, ఆగస్టు 29 -- Aishwarya Rai Rejection For Taal Reasons: భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయిన ప్రతిష్టాత్మక మ్యూజికల్ హిట్ చిత్రాల్లో 'తాళ్' (1999) ఒకటి. ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన ఈ చిత్రం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మంత్రముగ్ధమైన స్వరాలు, ఐశ్వర్య రాయ్ అద్భుత నృత్యాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇందులో 'మాన్సి' అనే గ్రామీణ యువతి పాత్రలో ఐశ్వర్య రాయ్ ఒదిగిపోయిన తీరు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే, ఈ ఐకానిక్ పాత్ర కోసం ఐశ్వర్య రాయ్‌ను ఎంపిక చేయడానికి డైరెక్టర్ సుభాష్ ఘాయ్ మొదట అస్సలు ఒప్పుకోలేదనే నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇటీవల ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుభాష్ ఘాయ్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'తాళ్' చిత్రంలో హీరోయిన్ పాత్రకు నృత్యం చాలా కీలకం. దాంతో మాధుర...