భారతదేశం, మార్చి 12 -- కోకాపేట్‌లో అల్లు సినిమాస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాను కూడా సినిమా అభిమాని అని చెప్పారు. సినిమా సాంకేతికంగా వేగంగా ముందుకు వెళుతుందన్నారు. దేశంలో సినిమాకు గొప్ప పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అల్లు కుటుంబాన్ని సీఎం అభినందించారు.

'ప్రేక్షకులని కట్టిపడేసే సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. బాహుబలి, కల్కి, అరుంధతి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు తెలుగు సినిమాను హైదరాబాద్ తీసుకొచ్చారు. కృష్ణ సినిమాలో అడ్వెంచర్స్ చేశారు. నేను కృష్ణ అభిమానిని. లారీ ఎక్కి వ...