భారతదేశం, అక్టోబర్ 14 -- న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక అడుగు వేసింది. బ్యాంక్‌లో 60.72 శాతం మెజార్టీ వాటాను ప్రముఖ పెట్టుబడి సంస్థ 'ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌'కు రూ.52,877 కోట్లకు విక్రయించేందుకు కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. గతంలో ఎయిర్ ఇండియాను విక్రయించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) ఒప్పందంగా ఇది నిలవనుంది.

కేంద్ర ప్రభుత్వం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సంయుక్తంగా ఐడీబీఐ బ్యాంక్‌లో ఉన్న తమ వాటాలను విక్రయించడానికి రంగం సిద్ధం చేశాయి. కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఒప్పందం వివరాలను ప్రకటించారు. విక్రయం అనంతరం పునర్వ్యవస్థీకరించే ఈ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం...