ఐటీసీ క్యూ4 ఫలితాలు: లాభం 72% పతనం.. కానీ అది చూసి కంగారు పడక్కర్లేదు
భారతదేశం, మే 21 -- స్టాక్ మార్కెట్ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐటీసీ క్యూ4 (Q4FY26) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే నికర లాభం భారీగా తగ్గినట్లు కనిపించడం మార్కెట్లో చర్చకు దారితీసింది. అయితే, ఇది కంపెనీ వ్యాపార వైఫల్యం వల్ల కాదు, కేవలం సాంకేతిక కారణాల వల్ల జరిగిందని స్పష్టమవుతోంది.
నిజానికి ఐటీసీ వ్యాపారం చాలా నిలకడగా సాగుతోంది. గతేడాది (Q4FY25) ఐటీసీ తన హోటల్ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసింది. ఆ సమయంలో కంపెనీకి Rs.15,179 కోట్ల వన్-టైమ్ లాభం (One-time gain) వచ్చింది.
గతేడాది లాభంలో ఈ అదనపు సొమ్ము కలిసి ఉండటం వల్ల ఆ సంఖ్య భారీగా కనిపించింది. ఈ ఏడాది అలాంటి వన్-టైమ్ ఆదాయం లేకపోవడంతో, వార్షిక ప్రాతిపదికన పోల్చినప్పుడు లాభం పడిపోయినట్లు కనిపిస్తోంది. ఒకవేళ మనం గడిచిన మూడో త్రైమాసికం (Q3FY26)తో పోలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.