భారతదేశం, జూలై 24 -- ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఒకవేళ మీరు ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే వెంటనే అప్రమత్తం కావాల్సిందే. జులై 31 గడువు దాటితే పన్ను చెల్లింపుదారులు ఐదు రకాల ఆర్థిక జరిమానాలు, చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రతి ఏటా జులై చివరి వారంలో ఐటీ శాఖ పోర్టల్ పై రద్దీ విపరీతంగా పెరుగుతుంది. సకాలంలో ఫైలింగ్ పూర్తి చేయకపోవడం, తప్పుడు వివరాలు నమోదు చేయడం లేదా వివరాలను దాచిపెట్టడం వల్ల అదనపు ఆర్థిక భారం పడుతుంది. అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27కు సంబంధించి పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఆ 5 పెనాల్టీల వివరాలు పరిశీలిద్దాం.

లేట్ ఫైలింగ్ ఫీజు (Late Filing Fee): నిర్దేశిత గడువు జులై 31 దాటిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఆలస్య రుసుము కట్టాల్సి వస్తుం...