భారతదేశం, జూన్ 4 -- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. కేరళకు గురువారం (జూన్ 4) నైరుతి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని, అక్కడి నుంచి తదుపరి మూడు లేదా నాలుగు రోజుల్లో ఇవి ఆంధ్రప్రదేశ్‌ను తాకవచ్చని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.

గతేడాది మే 26నే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. ఈ ఏడాది కూడా జూన్ 1 నాటికే రుతుపవనాలు రాష్ట్రానికి వస్తాయని భావించినప్పటికీ, రుతుపవనాల రాకను అధికారికంగా ప్రకటించడానికి అవసరమైన వాతావరణ పరిస్థితులు పూర్తిస్థాయిలో అనుకూలించలేదని వాతావరణ నిపుణులు తెలిపారు.

సాధారణంగా కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత, అవి ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోవడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని ఐఎండి అమరావతి శాస్త్రవేత్త ఎస్. కరుణాసాగర్ తెలిపారు. అయితే ఒకవేళ ఏవైనా ప్రతికూల ప...