భారతదేశం, మే 27 -- మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ (IRCTC) తాజాగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఒకే ప్యాకేజీలో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రత్యేకత ఏమిటంటే, పవిత్ర క్షేత్రాల దర్శనంతో పాటు ఎంతో విశిష్టమైన 'యమునా పుష్కరాలు'లో పుణ్యస్నానం ఆచరించే సదుపాయాన్ని కూడా కల్పించారు.

ఈ ప్రత్యేక టూర్ మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లు సాగుతుంది. ప్రయాణ తేదీ జూన్ 3వ తేదీన ఉంది. ఈ టూర్‌లో పూరి, కోణార్క్, బైద్యనాథ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ కవర్ అవుతాయి.

బోర్డింగ్ స్టేషన్ల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ముఖ్యమైన స్టేషన్ల నుండి ప్రయాణికులు ఈ రైలు ఎక్కవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవర...