భారతదేశం, సెప్టెంబర్ 24 -- బీమా రంగ నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రతిపాదించిన కీలక సంస్కరణలు స్టాక్ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. పాలసీల విక్రయాల్లో మిస్-సెల్లింగ్‌ను అరికట్టడం, కస్టమర్లకు మరింత పారదర్శకమైన డిజిటల్ సేవలు అందించడం లక్ష్యంగా ఐఆర్‌డీఏఐ నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనల ప్రభావంతో గురువారం, సెప్టెంబర్ 24న నాటి ట్రేడింగ్‌లో ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.

ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించిన నూతన వ్యయ నియంత్రణ పరిమితులు బీమా రంగానికి గట్టి ఎదురుదెబ్బగా మారతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి.

టర్టిల్‌మింట్ (Turtlemint): ఏకంగా 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ. 109.10 వద్ద నిలిచింది.

పిబి ఫి...