భారతదేశం, జూలై 15 -- హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ (రిటైర్డ్) చీటి మురళీధర్ రావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
మురళీధర్ రావు నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం, ఆయన్ను అరెస్టు చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, జహీరాబాద్‌లలో ఏకకాలంలో మొత్తం 10 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ కేసుపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.