భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీసీఆర్డీఏ) ఏప్రిల్ 27 నుంచి రాజధాని ప్రాంత యువత కోసం ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఏపీసీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సహకారంతో, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

అమరావతి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంచి, జీవనోపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. వివిధ రంగాలలో పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను శిక్షణార్థులకు అందించేలా ఈ శిక్షణా కోర్సులను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

ఈ కోర్సులలో ట్యాలీతో జీఎస్టీ అసిస్టెంట్, కంప్యూటర్ నెట్‌వర్క్, స్టోరేజ్, వీఎల్ఎస్ఐ డిజైన్...