ఏపీ స్థానిక ఎన్నికలు : 'మా అభ్యర్థులపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు' - ఎన్నికల కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు
భారతదేశం, అక్టోబర్ 17 -- రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కడప, తిరుపతి, రాయచోటి, రాజంపేట, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నాయని.. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా భయభ్రాంతులకు గురిచేస్తూ అడ్డుకుంటున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అధికార పార్టీ అరాచకాలపై, పోలీసుల ఏకపక్ష వైఖరిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
కడప నగరంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు నామినేషన్ కేంద్రాలను ముట్టడించి, వైఎస్సార్సీపీ అభ్యర్థులను లోపలికి వెళ్లకుండా రహదారులపైనే అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసు అధికారులు కళ్లప్పగించి చూస్తుండగానే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.