ఏపీ స్థానిక ఎన్నికలు : రెండ్రోజుల్లో 45 చోట్ల ఘర్షణలు.... హింసకు పాల్పడితే కఠిన చర్యలు - డీజీపీ వార్నింగ్
భారతదేశం, అక్టోబర్ 23 -- రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు సంబంధించి గడిచిన రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 45 హింసాత్మక ఘటనలు నమోదైనట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
శుక్రవారం ఒక్కరోజే 8 జిల్లాల్లో 14 అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయని డీజీపీ తెలిపారు. పల్నాడు, కడప జిల్లాల్లో అత్యధికంగా మూడేసి ఘటనలు జరగ్గా.. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో రెండేసి చొప్పున, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, మార్కాపురం జిల్లాల్లో ఒక్కో సంఘటన నమోదైంది. అంతకుముందు గురువారం (అక్టోబర్ 22) నాడు 13 జిల్లాల్లో 31 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో 22 దాడులు, ఘర్షణలకు సంబంధిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.