ఏపీ వైపు దూసుకొస్తున్న 'అక్వాన్' తుపాను.. తీరం దాటేది ఎప్పుడంటే?
భారతదేశం, నవంబర్ 16 -- ఆంధ్రప్రదేశ్ తీరంపై మరో పెను తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం 'అక్వాన్' తుపానుగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. నవంబర్ 19న ఏపీ తీరానికి చేరువయ్యే క్రమంలో ఇది అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం (నవంబర్ 16) విడుదల చేసిన తాజా బులిటెన్లో హెచ్చరించింది.
ప్రస్తుతం ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఈ వాతావరణ వ్యవస్థ కేంద్రీకృతమై ఉంది. సోమవారం సాయంత్రానికి ఇది తుపానుగా, మంగళవారం (నవంబర్ 17) సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారనుంది. ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 19 రాత్రికి అతి తీవ్ర తుపాను రూపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఏపీ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.