ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్ - 28న తీరం దాటే అవకాశం..! 140 కి.మీ. వేగంతో ఈదురుగాలు
భారతదేశం, అక్టోబర్ 26 -- బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నబ్' తుఫాన్ వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను గడిచిన ఆరు గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇది మరింత బలపడి 'అతి తీవ్ర తుఫాను'గా రూపాంతరం చెంది.. అక్టోబర్ 28 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశముందని స్పష్టం చేసింది.
అక్టోబర్ 28 ఉదయానికి ఈ తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకుని ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపిస్తుంది. "అక్టోబర్ 28న మధ్యాహ్నంలోగా బాపట్ల - విశాఖపట్నం మధ్య (యానాం తీరంతో కలిపి) అతి తీవ్ర తుఫాను రూపంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సందర్భాల్లో గాలుల వేగం గరిష్ఠంగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.