భారతదేశం, జూన్ 7 -- సాగు ఎరువులు పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. సాగుదారులకు సకాలంలో.. సరైన ధరకే యూరియా, డీఏపీ ఎరువులను అందించే లక్ష్యంతో ప్రత్యేకంగా రూపొందించిన 'ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌' (APAIMS 2.0 - ఏపీఎయిమ్స్‌) యాప్‌ను ప్రభుత్వం అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త యాప్ ఆధారిత విధానం ద్వారా సోమవారం(జూన్ 8) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

కృష్ణా, కాకినాడ జిల్లాల్లో మాత్రం ఈ విధానం ప్రస్తుతానికి ప్రారంభం కావడం లేదు. ఈ రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సోమవారం నుంచే ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఎరువుల యాప్‌కు పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికైనందున కృష్ణా, కాకినాడ జిల్లాలను మా...