భారతదేశం, ఆగస్టు 3 -- ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం వేలంకన్నిలో జరగనున్న వార్షిక పండుగ మహోత్సవాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల అదనపు రద్దీని అధిగమించేందుకు ముంబైలోని లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ , వేళాంకణ్ణి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పలు వివరాలను వెల్లడించింది.

ఈ ప్రత్యేక సర్వీసులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి. దీంతో రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఆధ్యాత్మిక భక్తులకు, ప్రయాణికులకు వేలంకన్నికి వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యం మరింత సులభతరం కానుంది.

ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించే క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం అనేక ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో ఠాణే, కళ్యాణ్, లోనావాలా, పూణే, దౌండ్, సోల...