ఏపీ పురపోరు: ముగిసిన నామినేషన్ల ఘట్టం.. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఫలితాలు
భారతదేశం, అక్టోబర్ 18 -- ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారంతో పూర్తయింది. చివరి రోజైన ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటల సమయానికి రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద వరుసలో ఉన్న అభ్యర్థులందరి పత్రాలను అధికారులు స్వీకరించారు.
అంతిమ గడువు ముగియడంతో అన్ని ప్రధాన పార్టీల మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం అక్టోబర్ 19న అధికారులు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల పరిశీలన చేపడతారు.
పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల వరకు అవకాశం కల్పించారు. అదే రోజు సాయంత్రం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.