భారతదేశం, నవంబర్ 7 -- ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విజయనగరం జిల్లాలో వైకాపా సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో పోటీ చేసిన బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు.

ఇక్కడ నుంచి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ (తెదేపా) అభ్యర్థి పాశల నీరజ, బొత్స అనూషపై ఏకంగా 5,136 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. స్థానిక జెడ్పీ ఛైర్‌పర్సన్ రేసులో ప్రధానంగా వినిపించిన అనూష ఓటమి పాలవడంతో వైకాపా శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. నీరజ విజయంతో బొండపల్లిలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి శ్రేణులు భారీ ఎత్తున విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాయి.

ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ కు...