ఏపీ దేవాదాయ శాఖలో 342 పోస్టులు.. లైవ్ వీడియో రికార్డింగ్‌తో ఇంటర్వ్యూలు
భారతదేశం, జూన్ 8 -- ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 342 పోస్టుల భర్తీకి భారీ స్పందన లభించిందని ఆ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. ఈ పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 5,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులకు ప్రస్తుతం మౌఖిక పరీక్షలు (ఇంటర్వ్యూలు) అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
మల్టీ-జోన్ I (శ్రీకాకుళం జిల్లా నుండి కృష్ణా జిల్లా వరకు) పరిధిలోకి వచ్చే అభ్యర్థులకు విజయవాడలోని మాడపాటి గెస్ట్ హౌస్‌లో మౌఖిక పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇతర జోన్లకు చెందిన ప్రముఖ పండితులతో ఈ ఇంటర్వ్యూలను నిర్వహింపజేస్తున్నారు. అంతేకాకుండా ఈ జోన్ వెలుపలి ప్రాంతాలకు చెందిన ఇ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.