ఏపీ తెలంగాణ వెదర్ రిపోర్ట్ : ఈ 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు - ఈదురుగాలుల హెచ్చరికలు
భారతదేశం, సెప్టెంబర్ 4 -- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలో ఇవాళ, రేపు (సెప్టెంబర్ 4, 5) మేఘావృతమైన వాతావరణం నెలకొనడంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వివరాల ప్రకారం. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అకస్మాత్తుగా వీచే గాలులు, పిడుగుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.
పిడుగులు పడే ముప్పు ఉన్నందున వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు, కూలీలు, పశువుల కాపరులు తీవ్ర అప్రమత్తత పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షం వచ్చే సూచనలు కనిపించగానే పొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.