భారతదేశం, జూలై 21 -- ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) ప్రతిభావంతులైన విద్యార్థులకు సువర్ణావకాశం కల్పించింది. 2026-27 విద్యాసంవత్సరానికి గానూ తమ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoEs) కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సులతో పాటు ఐఐటీ-జేఈఈ (IIT-JEE), నీట్ (NEET) ఉచిత శిక్షణలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఏపీఎస్డబ్ల్యూఆర్‌ఈఐఎస్ అధికారులు సమాచారాన్ని వెల్లడించారు.

విశాఖపట్నంలోని మేఘాద్రిగెడ్డ, గుంటూరు జిల్లాలోని అమరావతి-తాడికొండ, అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని కోట ప్రాంతాల్లో ఉన్న సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఈ అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (జూనియర్ ఇంటర్), రెండో సంవత్సరం (సీనియర్ ఇంటర్) MPC, BiPCలో అడ్మిషన్స్ ఉన్నాయి.

మొదటి...