ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ, కొత్త విదేశీ విద్యా విధానానికి గ్రీన్ సిగ్నల్
భారతదేశం, అక్టోబర్ 7 -- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో భేటీలో ప్రజా సంక్షేమం, ఆరోగ్యం, విద్య, భూ కేటాయింపులు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి మొత్తం 12 కీలక అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వైద్యారోగ్య రంగం బలోపేతం, ఆశా కార్యకర్తలకు ఆర్థిక భద్రత, విదేశీ యూనివర్సిటీల ఆహ్వానం వంటి పలు ప్రాధాన్య అంశాలపై ప్రభుత్వం సమగ్రంగా చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విధి నిర్వహణలో మరణించిన అర్హత కలిగిన ఆశా కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక ఊరట కల్పిస్తూ గ్రాట్యుటీ చెల్లింపు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆశా కార్యకర్త అందించిన ప్రతి ఏడాది సర్వీసుకు రూ. 5,000 చొప్పున లెక్కించి గ్రాట్యుటీ అందజేస్తారు. ఒక్కో బాధిత కుటుంబానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.